శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 14 ఆగస్టు 2021 (19:51 IST)

లాక్ డౌన్‌లో లక్షలు సంపాదించిన సమంత, అందులో ఒక్క పోస్టు పెడితే రూ. 30 లక్షలా?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో సమంత అక్కినేని ఒకరు. ఆమె ఇటీవల శాకుంతలం కోసం షూట్ పూర్తి చేసింది. లాక్ డౌన్లో ఉత్త చేతులతో ఖాళీగా లేకుండా రెండు చేతులతో సంపాదిస్తోంది సమంత. ఇది కాస్త ఆసక్తికరంగానే వుంది.
 
ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న తారల్లో ఆమె ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్ చేస్తే దానికిగాను ఏకంగా సమంత 25 నుండి 30 లక్షల రూపాయలు పొందుతున్నట్లు టాలీవుడ్ పిల్లజర్నలిస్టులు చెప్పుకుంటున్నారు.
 
షోరూమ్ ప్రారంభాలు, టాక్ షోలు, గేమ్ షోలు సరేసరి. టైం దొరికితే చాలు మనీ మిషన్ తిప్పుతోందట సమంత. మొత్తమ్మీద సమంత ఎందులో చేయి పెట్టినా లక్ష్మీదేవి పరుగులు పెడుతూ ఆమె వెంటబడుతోందట.