బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (15:58 IST)

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా యంగ్ హీరో.. ఆయనెవరో?

బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లు

బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లుగా నటిస్తారని తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో..  రాజమౌళి ఈ చిత్రానికి గాను విలన్‌ను ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యాడట. కథాపరంగా పవర్ ఫుల్ విలన్‌ను ఎంపిక చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. ఇందుకోసం ఆడిషన్స్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 
 
జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మల్టీస్టారర్ సినిమాకు స్క్రిప్ట్ అందించారు. ఇందులో విలన్ కోసం రాజమౌళి ఒక యంగ్ హీరోను సంప్రదించారట. ఆ హీరో అయితేనే విలన్ పాత్రకు న్యాయం జరుగుతుందని టాక్ వస్తోంది. ఆ హీరో ఎవరనే దానిపై ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే హీరోయిన్ల కోసం కూడా రాజమౌళి వేట ప్రారంభించారని సమాచారం.