1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 మార్చి 2021 (15:32 IST)

అల్లుడుతో రొమాన్స్ చేసే పాత్రలో టబు, కూతురుగా కియారా అద్వానీ

ఈమధ్య కాలంలో కథలు విభిన్నంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఎఫైర్స్, లింకులు వున్న కథలతో తెరకెక్కిన చిత్రాలు కోకొల్లలు. తాజాగా బాలీవుడ్ నటి టబు ఇలాంటి పాత్రలో నటిస్తోందట.
 
50ల్లోకి అడుగుపెట్టిన టబు రొమాంటిక్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకాడటంలేదట. పాత్రలో దమ్ముంటే చేసేందుకు సై అంటోందట. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం భూల్ భలయ్య 2. ఇందులో కియారా అద్వానికి తల్లిగా నటిస్తోంది. ఐతే కుమార్తె ప్రియుడుతో రొమాంటిక్ సన్నివేశాలు చేస్తోందట. కియారా ప్రియుడిగా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతానికి ఈ చిత్రం షూటింగ్ ఆగింది కానీ ఇందులో కాకపుట్టించే సీన్లలో టబు నటిస్తుందనడం చర్చనీయాంశంగా మారింది.