సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 డిశెంబరు 2021 (10:47 IST)

రవితేజతో అనుష్క శెట్టి, విక్రమార్కుడు సీక్వెల్ ప్లాన్?

రవితేజ-అనుష్కశెట్టి నటించిన విక్రమార్కుడు చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది రాజమౌళి. విక్రమార్కుడు చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

 
ఈ చిత్రంలో హీరోగా రవితేజ సరసన స్వీటీ అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ స్టోరీ రెడీ చేసినట్లు ఫిలిమ్ సర్కిళ్లలో చెప్పుకుంటున్నారు. ఐతే ఈ చిత్రాన్ని దర్శకత్వం చేసేది రాజమౌళి కాదట. సంపత్ నంది అని టాలీవుడ్ న్యూస్.

 
మొత్తమ్మీద ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితో మరోసారి రవితేజ-అనుష్కల క్రేజీ కాంబినేషన్ చూడొచ్చు.