బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 12 జూన్ 2019 (16:33 IST)

బాల‌కృష్ణ కొత్త సినిమా టైటిల్ మారిందా..? అస‌లు కార‌ణం ఇదేనా..?

నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణ.. త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వి కుమార్ ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చిత్రంలో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ సి.కె. ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన నిర్మించ‌నున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని స‌మాచారం.
 
ఈ సినిమాకి రూలర్ అనే టైటిల్‌ను ఖరారు చేసిన‌ట్టుగా ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ ఏంటంటే... ఈ మూవీ టైటిల్ మారింద‌ట‌. కార‌ణం ఏంటంటే... ఈ సినిమాలో క‌థ‌నాయ‌కుడు పేరు క్రాంతి అని...  అందువలన ఈ మూవీకి 'క్రాంతి' అనే టైటిల్ ఖ‌రారు చేసేందుకు టీమ్ ఆస‌క్తి చూపుతున్నార‌ని తెలిసింది. 
 
దాదాపు ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఆయన పాత్ర.. టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర తరహాలో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల్లో వాస్త‌వం ఎంత అనేది తెలియాల్సివుంది.