శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (09:43 IST)

కమ్మోళ్లను నమ్ముకుని ఆ చిత్రాన్ని తీయడం లేదు : వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం కోల్పోయిన రోజునే ఈ టైటిల్‌తో చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించారు. 
 
పైగా, ప్రస్తుతం నవ్యాంధ్రలో సీఎంగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆయన కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్‌తో సినిమా తీయనున్నట్టు ప్రకటించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పైగా, ఈ సినిమా టైటిల్ ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ సినిమా టైటిల్‌లో కమ్మ, రెడ్లు అనే పదాలు కులాల్ని సూచిస్తుండడంతో దీనిపై వర్మ వివరణ ఇచ్చారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం కమ్మ వర్గీయులను లక్ష్యంగా చేసుకుని తీస్తున్న చిత్రం కాదని స్పష్టంచేశారు. దీనిపై కొందరు అపోహపడుతున్నట్టు అర్థమవుతోందని, కానీ తన చిత్రం కమ్మ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తీయడంలేదని వర్మ చెప్పుకొచ్చారు. 
 
తనకు ఏ కులం లేదని, కులంపై నమ్మకమే లేదని తెలిపారు. విజయవాడలో ఉండే విభిన్న రాజకీయ వాతావరణం ఆధారంగా తన చిత్ర కథ ఉంటుందేగానీ, ఒక వర్గాన్ని నమ్ముకుని లేదా కించపరిచేలా ఈ చిత్రాన్ని తాను నిర్మించడం లేదని రాంగోపాల్ వర్మ వివరణ ఇచ్చారు.