ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (17:58 IST)

ఆడవాళ్లు మీకు జోహార్లు సాంగ్ ఫిబ్ర‌వ‌రి 4- సినిమా ఫిబ్రవరి 25న విడుద‌ల‌

Sharwanand
శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది.
 
ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు కాబోతోన్నాయి. ఫిబ్రవరి 4న టైటిల్ సాంగ్ (ఆడవాళ్లు మీకు జోహార్లు)ను రిలీజ్ చేయబోతోన్నారు. ఫిబ్రవరి 4 సాయంత్రం 4:05 గంటలకు ఈ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో శర్వా స్టైలీష్‌ లుక్ లో కనిపిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
 
టైటిల్‌ను బట్టి చూస్తే ఇది మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా కనిపిస్తోంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 
 
మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు.  సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు
 
సాంకేతిక బృందం- దర్శకత్వం: తిరుమల కిషోర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి, బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, కొరియోగ్రఫర్: దినేష్