శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (11:57 IST)

ప్ర‌భాస్ బ‌ర్త్‌డే.. ఆదిపురుష్ నుంచి అప్డేట్: రాముడిగా ప్రభాస్ లుక్ అదుర్స్

Adipurush
Adipurush
ఆదిపురుష్ టీమ్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అందించింది. రాముడిగా ప్రభాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో బాణాన్ని సంధించడానికి సిద్ధమవుతున్నట్లు ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తున్నారు.   
 
రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. చెడుకు ప్ర‌తీక‌గా నిలిచిన రావ‌ణుడిపై రాముడు సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు. 
 
మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్ష‌న్స్‌లో దాదాపు ఐదు వంద‌ల కోట్ల వ్య‌యంతో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది.
 
ఇందులో జాన‌కిగా కృతిస‌న‌న్ న‌టిస్తోంది. రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నాడు. వ‌చ్చేఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ఆది పురుష్ రిలీజ్ కానుంది.