గురువారం, 8 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 14 సెప్టెంబరు 2022 (12:41 IST)

డార్లింగ్ ఫ్యాన్సుకు గుడ్ న్యూస్.. ఆది పురుష్ టీజర్ వచ్చేస్తుందిగా?

Adipurush
డార్లింగ్ ఫ్యాన్సుకు గుడ్ న్యూస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్‌లో 'ఆదిపురుష్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తి నిరాశలో ఉన్నారు. ఫస్ట్ లుక్ అయినా విడుదల చేస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 
 
ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయేలా ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఫస్ట్ లుక్ కాదు.. ఏకంగా టీజర్‌నే విడుదల చేయబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో నిర్వహించబోయే గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.