బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (23:05 IST)

జపాన్‌లో అదిరిపోతున్న 'నాటు నాటు' పాట.. మాయో ఇరగదీసే స్టెప్పులు (Video)

Natu Natu
Natu Natu
ఆర్ఆర్ఆర్ మూవీలో 'నాటు నాటు' సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి అదిరే స్టెప్పులు వేశారు. ఈ స్టెప్పులకు ఎందరో ఫిదా అయ్యారు. ఇటీవల యూఎస్‌లో ఆస్కార్ సినీ ప్రదర్శన సందర్భంగా ఈ పాటకు సూపర్ క్రేజ్ వచ్చింది. 
 
అమెరికన్లు కూడా ఈ పాటకు స్టెప్పులేసి ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ పాటకు క్రేజ్ వచ్చేసింది. 
 
ప్రముఖ జపనీస్ యూట్యూబర్ మాయో నాటు నాటు సాంగ్‌కు ఇరగదీసేలా స్టెప్పులు వేసింది. సహచరుడితో కలసి రద్దీగా ఉన్న రహదారిపై డ్యాన్స్ చేసిన వీడియోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా రామ్ చరణ్, తారక్, ఎస్ ఎస్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలమయ్యామని చెప్పారు. 
 
ఇంటికి వెళ్తూ వెళ్తూ ఓ వీడియో కూడా చేశామంది. ప్రస్తుతం మాయో పోస్టు చేసిన వీడియోకు భారీగా లైకులు వెల్లువెత్తుతున్నాయి. వ్యూస్ అదిరిపోతున్నాయి.