ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (13:46 IST)

నాకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫర్లు వచ్చాయి.. కోట్లిస్తానన్నారు.. కానీ వద్దన్నాను?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని నిర్మించాయి. ఇందులో బన్నీ సరసన పూజా హేగ్డే నటించింది. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ సక్సస్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 12 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే... ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఎలా మాట్లాడాడో... అందరికీ తెలిసిందే. బన్నీ అంతలా మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. నాన్న గురించి మాట్లాడడం... నాన్న అల్లు అరవింద్ కు పద్మశ్రీ ఇవ్వాలి అనడం చర్చనీయాంశం అయ్యాయి. వీటి గురించి అడిగితే... అలా మాట్లాడేసాను అంతే. ఏదీ ప్లాన్ చేసి మాట్లాడలేదు అన్నాడు. ఇది సరే... స్టేజ్ పై డ్యాన్స్ వేయడం గురించి అడిగితే... అసలు డ్యాన్స్ చేయాలని అనుకోలేదట.
 
ఫ్యాన్స్‌ని చూడగానే.. ఉత్సాహం అలా వచ్చేసింది. పాట పెట్టమని డ్యాన్స్ చేసేసాను అన్నాడు. ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు అల్లు అర్జున్. ఇంతకీ మేటర్ ఏంటంటే...  స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫర్లు తనకు చాలా వచ్చాయట. కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్లు కూడా ఇచ్చారని, కానీ... తను వాటిని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. తనకు నచ్చితేనే స్టేజ్ పై డాన్స్ చేస్తానని స్పష్టం చేశాడు.