సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (06:20 IST)

నేల టికెట్ బ్యాచ్.. కసి తీరకపోతే శవాన్ని లేపి చంపుతా : బాలకృష్ణ (Trailer)

టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ థ్రియాట్రికల్ ట్రైలర్‌ను గురువారం రాత్రి చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘మేరా నామ్ తేడా.. తేడా

టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ థ్రియాట్రికల్ ట్రైలర్‌ను గురువారం రాత్రి చిత్రయూనిట్ విడుదల చేసింది.


‘మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. దిమాక్ తోడా.. 36 దోపిడీలు..24 మర్డర్లు..36 స్టాపింగ్‌లు.. దిస్ ఈజ్ మై విజిబుల్ రికార్డ్ ఇన్ వికీపీడియా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంది.
 
అలాగే, మనది నేల టికెట్ బ్యాచ్.. కసి తీరకపోతే శవాన్ని లేపి మరి చంపేస్తా అంటూ చెప్పిన డైలాగ్స్ మూవీపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రియ నటిస్తున్నది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా హీరో బాలయ్య మాట్లాడుతూ.. ‘నన్ను ఎవరు? అని ఎవరైనా అడిగితే నేను ఏం సమాధానం చెబుతానో తెలుసా? ‘భారతీయుడు’ అని. మళ్లీ ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే.. ‘తెలుగోడిని’ అని సమాధానం చెబుతా. ఇంకోసారి ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే..‘నందమూరి తారకరామారావు కొడుకుని’ అని చెబుతాను. మరోసారి ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే.. ‘ఎన్టీఆర్ అభిమానిని’ అని చెబుతాను’ అంటూ బాలకృష్ణ ఆసక్తికరంగా మాట్లాడారు. 
 
ఇకపోతే.. దర్శకుడు పూరీ జగన్నాథ్ తనను మోక్షఙ్ఞ కన్నా చిన్నవాడిలా అనుకుంటున్నారంటూ కామెంట్ చేశారని, దానికి కారణం.. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఈ చిత్ర నిర్మాత సవ్యంగా సమకూర్చడమేనని, అందుకే, ఈ ఉత్సాహం, స్పీడ్ అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ తో తాను చేసిన మొదటి చిత్రమిదని, ‘పైసా వసూల్’ చేయడంలో ఈ చిత్రం దూసుకుపోతుందని బాలకృష్ణ అన్నారు.