ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (20:01 IST)

బుక్ మై షోలో కనిపించని భీమ్లా నాయక్ - ఆందోళనలో పవన్ ఫ్యాన్స్

ఈ నెల 25వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్" చిత్రం విడుదలకానుంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, దగ్గుబాటి రానా విలన్‌గా నటించారు. ఈ చిత్రం కోసం టిక్కెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, పాపులర్ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో 'భీమ్లా నాయక్' కనిపించడం లేదు. ఇది పవన్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నైజాం ఏరియాలకు చెందిన తెలుగు సినిమా పంపిణీదారులు ప్రముఖ ఆన్‌లైన్ ఎంటర్‌టైన్మెంట్ టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీ బుక్ మై షోని నిషేధించాలని నిర్ణయించాయి. దీంతో నైజా ఏరియాకు సంబంధించిన 'భీమ్లా నాయక్' ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ మై షో యాప్‌కు ఇవ్వలేదు. 
 
దీనికి కారణం.. బుక్ మై షో టిక్కెట్ అధిక ధరకు విక్రయిస్తుంది. దీంతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంది. అదేసమయంలో ఏపీలో టిక్కెట్ల పంచాయతీకి పరిష్కారం లభించేంత వరకు సినిమా టిక్కెట్లను థియేటర్ కౌంటర్లలోనే విక్రయించాలని ఎగ్జిబిటర్లు చిత్రపరిశ్రమను కోరినట్టు సమాచారం. ఈ కారణంగా భీమ్లా నాయక్ టిక్కెట్లను బుక్ మై షో ‌లో అందుబాటులో ఉంచలేదు.