భూమిక భర్తకు విడాకులు ఇచ్చిందా?

Bhumika
Bhumika
సెల్వి| Last Updated: బుధవారం, 21 అక్టోబరు 2020 (19:15 IST)
అందాల రాశి తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సినిమాల్లోనూ నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఆ తర్వాత యోగా గురు భరత్ ఠాకూర్‌ను 2007లో వివాహం చేసుకుంది. భర్తతో కలిసి సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది. అయితే ఈ మధ్య నుంచి భూమిక విడాకులు తీసుకుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై భూమిక ఇప్పటివరకు స్పందించలేదు.

అయితే తాజాగా ఆ వార్తలకు పరోక్షంగా చెక్ పెట్టింది. అలాగే తన భర్తకు భూమిక సోషల్ మీడియా ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. భర్త పట్ల తనకున్న ప్రేమను తెలియజేసింది. దీంతో విడాకుల వార్తలకు భూమిక పరోక్షంగా చెక్ పెట్టినట్టైంది. ప్రస్తుతం భూమిక సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొడుతోంది. చిత్రంలో నేచురల్ స్టార్ నానితో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నానికి వదినగా నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆఫర్లను కలిగివుంది.దీనిపై మరింత చదవండి :