నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేసిన చిరంజీవి... ఎవరితో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సైరా సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే...చిరంజీవి ఈ సినిమా తర్వాత బ్లాక్‌బష్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నాడు అంటూ ప్రచారం జరిగింది. జనవరిలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని కూడా గతంలో వార్తలు వచ్చాయి.
ఇదలాఉంటే... వినయవిధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఊహించని విధంగా నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేసారు. ఇంతకీ ఎవరితో అంటారా..? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నాను అంటూ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు అని కూడా చెప్పారు. కొసమెరుపు ఏంటంటే... ఈ ప్రాజెక్టుని సెట్ చేసింది రామ్ చరణ్. ఈ విషయాన్ని కూడా చిరంజీవి బయటపెట్టారు. అంతా బాగానే ఉంది మరి... కొరటాలతో సినిమా గురించి ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో..?