ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (11:38 IST)

హైదరాబాద్ వచ్చిన చిరంజీవి - విధి వల్లే చిరుసార్ తో నటిస్తున్నా: సురభి

chiru at aiport today
chiru at aiport today
మెగాస్టార్ చిరంజీవి పిబ్రవరి 14 వ తేదీన యు.ఎస్.ఎ. కుటుంబంతో వెళ్ళారు. అక్కడే పలు కార్యక్రమాల్లో పాల్గొని కొన్ని గంటల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఆయన నటిస్తున్న విశ్వంభర చిత్రం షూట్ లో ఈనెల  28 న పాల్గొననున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాలో చిరంజీవితో కలిసి సురభి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.
 
surabhi
surabhi
ఇటీవలే హైదరాబాద్ లో ఓ స్టూడియోలో వేసిన సెట్లో ఆమె సన్నివేశాలు చిత్రీకరించారు. చిరంజీవి సార్ తో నటించడం కల నిజమైంది. విధి వల్లే నేను నటిస్తున్నాను. ఇందులో లంగా ఓణీ వేసుకునే పాత్రలో కనిపిస్తానని చెబుతోంది. ఇక మొదటి రోజు చిరంజీవి నా పనితనం గురించి అడిగారు. నటుడికి వుండ వలసిన లక్షణాలను తెలియజేశారు. బెరుకులేకుండా నటించమని చెప్పారు. ఆయన మాటలు స్పూర్తిగా తీసుకున్నాను. కొన్ని డేసీ షూటింగ్ తర్వాత, ఆమె ఇప్పుడు విరామం తీసుకుంటోంది.  త్వరలో మరో షెడ్యూల్ లో పాల్గొననుంది.
 
కాగా, మరో నటి ఇషా చావ్లా కూడా ఇందులో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథానాయికగా త్రిష నటిస్తుంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తోంది.