బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (12:24 IST)

రూ.3 కోట్ల అపరాధమా?.. అది గాలివార్త : లావణ్య త్రిపాఠి

తనకు కోలీవుడ్ నిర్మాత ఒకరు రూ.3 కోట్ల అపరాధం విధించినట్టు వచ్చిన వార్తపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందించారు. అవన్నీ గాలివార్తలేనని, అలాంటిదేం లేదని స్పష్టంచేశారు.

తనకు కోలీవుడ్ నిర్మాత ఒకరు రూ.3 కోట్ల అపరాధం విధించినట్టు వచ్చిన వార్తపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందించారు. అవన్నీ గాలివార్తలేనని, అలాంటిదేం లేదని స్పష్టంచేశారు. 
 
తెలుగులో విజయవంతమైన చిత్రం ‘100% లవ్’. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా చేస్తానని చెప్పిన లావణ్య త్రిపాఠి, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ శాలిని పాండేకు తీసుకున్నారు. 
 
అయితే, తమ చిత్రంలో నటిస్తానని అంగీకరించి, తర్వాత కాదన్న లావణ్య త్రిపాఠి వల్ల తాము నష్టపోయామని, అందువల్ల తమకు రూ.3 కోట్ల నష్టపరిహారాన్ని ఇప్పించాలని ఆ చిత్ర నిర్మాతలు తమిళ చిత్ర నిర్మాతల మండలిని కోరినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ వార్తలపై లావణ్య స్పందించారు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో ఉన్న ఆమె మాట్లాడుతూ... '100% లవ్' చిత్రం నుంచి తప్పుకున్నందుకు తనకు రూ.3 కోట్ల అపరాధం విధించినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టంచేశారు.