శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (12:35 IST)

నేను కూడా ప్రేమ బాధితుడినే: అర్జున్ రెడ్డి

''అర్జున్ రెడ్డి'' సినిమాలో ప్రేమ కోసం హీరో విజయ్ దేవరకొండ చేసిన నటన అంతా ఇంతా కాదు. అయితే ప్రేమికుల రోజున యువతకు తాజాగా లవ్వలు గివ్వులు వద్దంటున్నాడు. ఓ కార్యక్రమంలో అర్జున్ రెడ్డి మాట్లాడుతూ.. తాను

''అర్జున్ రెడ్డి'' సినిమాలో ప్రేమ కోసం హీరో విజయ్ దేవరకొండ చేసిన నటన అంతా ఇంతా కాదు. అయితే ప్రేమికుల రోజున యువతకు తాజాగా లవ్వలు గివ్వులు వద్దంటున్నాడు. ఓ కార్యక్రమంలో అర్జున్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎవరికీ ఐడోల్ కాదలచుకులేదని.. తాను కూడా మామూలబ్బాయినేనని చెప్పుకొచ్చాడు.

యువతకు లెక్చర్ ఇచ్చే స్థాయి కూడా తనది కాదని తెలిపాడు. అయితే స్నేహితులుగా భావించి మంచి చెప్పాలనుకుంటున్నా. తాను కూడా ప్రేమ బాధితుడినేనని అర్జున్ రెడ్డి చెప్పాడు. ఫిబ్రవరి 14న ఓ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్‌ను పొందానని అర్జున్ రెడ్డి చెప్పాడు. 
 
డాక్టర్ వద్దకు, జిమ్‌కు వెళితే ట్రైనర్ చెప్పినట్లు వింటానని... అలాగే తనకేదో తెలుసునని తాను చెప్పడాన్ని ఇంత కూల్‌గా విద్యార్థులు వినడం ఎంతో సంతోషకరమని అర్జున్ రెడ్డి తెలిపాడు.

యువత మందు తాగడం గర్ల్‌ఫ్రెండ్స్ వెంట పడటం మామూలే. అయితే మద్యానికి మీరు బానిస కాకుండా.. దానిని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోండని విజయ్ దేవరకొండ సలహా ఇచ్చాడు. యువతకు లక్ష్యం ముఖ్యమని తెలిపాడు.