ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (18:59 IST)

కాషాయం రంగు నాకు నచ్చదు.. లెఫ్టిస్ట్‌లే నా హీరోలు...

కాషాయం రంగు నాకు నచ్చదు.. లెఫ్టిస్టులే నా హీరోలు అంటున్నాడు విశ్వనటుడు. త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ఆ స్టార్ హీరో.. ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ స్టార

కాషాయం రంగు నాకు నచ్చదు.. లెఫ్టిస్టులే నా హీరోలు అంటున్నాడు విశ్వనటుడు. త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ఆ స్టార్ హీరో.. ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు... కోలీవుడ్ హీరో కమల్ హాసన్. 
 
ఆయన శుక్రవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కమల్‌హాసన్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తనకు వామపక్ష నేతలు పలువురితో ఎప్పటినుంచో పరిచయాలు ఉన్నాయన్నారు. 
 
లెఫ్టిస్టులు తన హీరోలని కూడా నవ్వుతూ చెప్పుకొచ్చారు. తన చాలా సినిమాల్లో లెఫ్టిస్ట్ భావజాలం కనిపిస్తుందని గుర్తు చేశారు. అదేసమయంలో బీజేపీతో కలిసేది లేదని, కాషాయం తన రంగు కాదని, అసలు ఆ రంగు నాకు నచ్చదని చెప్పారు. పైగా, లెఫ్టిస్ట్‌లే నా హీరోలు అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై త్వరలోనే ప్రకటన చేస్తానని కమల్ తెలిపారు.