శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (14:48 IST)

ఎఫ్ఐఆర్ క‌థ లాంటి సినిమా చేయాల‌నుంది- రవితేజ

Ravi Teja
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ  చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. 
 
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, ఈ సినిమాను స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న‌ట్లు పోస్ట‌ర్‌లో వేసుకోవ‌డంపై స్పందించారు. ఆరు నెలల క్రితం ఈ సినిమాను చూశాను. నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కంటెంట్ సినిమా. ఇలాంటి చిత్రం నాకు కూడా చేయాలని ఉంది. విష్ణు విశాల్ నిర్మాత‌గా చేస్తున్న సినిమా ఇది. క‌థ‌లో కొద్దిగా సూచ‌న‌లు చేశాను. త‌ను ఏమాత్రం అడ్డుచెప్ప‌కుండా మార్చుకున్నాడు. విష్ణు విశాల్ తెలుగులో మంచి లాండింగ్ సినిమా అవుతంది అన్నారు. ప్ర‌స్తుతం ర‌వితేజ‌, \రామారావ్ ఆన్ డ్యూటీ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఖిలాడి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మ‌రో సినిమా కూడా షూటింగ్ లో వుంది.