నయనతార ఇక మేకప్ వేసుకోవాల్సిన అవసరం వుండదు.. విక్కీ!
లేడి సూపర్ స్టార్ నయనతార పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె లవబుల్ హస్బెండ్, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సూపర్ విషెస్ తెలిపాడు. తనతో నయన తొమ్మిదవ పుట్టినరోజును జరుపుకుంటుందని.. ఈ పుట్టిన రోజు మాత్రం తనకు ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాదిలో ఎన్నో మరిచిపోలేని జ్ఞాపకాలు వున్నాయని విక్కీ వెల్లడించాడు. ఈ సంవత్సరం తాము భార్యాభర్తలుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు విక్కీ పోస్టు చేశాడు. ఈ ఏడాది తాము ఇద్దరు పిల్లలకు కూడా తల్లీదండ్రులమయ్యామని అన్నారు.
ఇకపై మన పిల్లలు నిన్ను ముద్దాడతారు కాబట్టి నువ్వు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదని విఘ్నేష్ స్వీట్ ట్వీట్ చేశారు. నీ ముఖంపై చిరునవ్వు, ఆనందం ఎప్పటికీ అలానే ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.