సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మే 2024 (23:56 IST)

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

jr ntr1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేట వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా 12.5 లక్షలు ఇచ్చారు. ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడా శిలాఫలకం.. ఎన్టీఆర్ దాన గుణాన్ని బయటపెట్టింది. 
 
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జగ్గన్నపేటలో కొంతకాలం క్రితం నిర్మించిన శ్రీ భద్రకాళీ సమేత ఆలయానికి సంబంధించిన విరాళాల వివరాలు తెలుపుతూ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. మరోవైపు దేవర ఫస్ట్ సింగిల్‌గా మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.