మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:28 IST)

సమంత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే...

టాలీవుడ్ హీరోయిన్ సమంత కేసులో కూకట్‌పల్లి కోర్టు కీలక తీర్పును వెలువరించింది. హీరో నాగచైతన్యతో తన వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్టు సమంత ప్రకటించింది. దీన్ని పలు యూట్యూబ్ చానెళ్లు వక్రీకరిస్తూ పలు కథనాలను ప్రచురించాయి. 
 
అయితే సీఎల్ వెంకట్రావు అనే వ్యక్తితో పాటు పలు యూట్యూబ్ చానళ్లు తన వ్యక్తిగత జీవితంపై ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయంటూ సమంత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఆమె కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. సమంతపై కోర్టులో మంగళ విచారణ కొనసాగించింది. 
 
సమంతపై కంటెంట్‌ను యూట్యూబ్ చానళ్లు వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. సీఎల్ వెంకట్రావు సైతం తన కంటెంట్‌ను తొలగించాలని కూకట్‌పల్లి కోర్టు స్పష్టంచేసింది. 
 
యూట్యూబ్ చానళ్లు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడరాదని, అదేసమయంలో సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు తక్షణం తొలగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.