శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జనవరి 2025 (15:35 IST)

మహా కుంభమేళా: సన్యాసం తీసుకున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (video)

Mamta Kulkarni
Mamta Kulkarni
బాలీవుడ్ నటి మమతా కులకర్ణి అనూహ్యంగా సన్యాసం తీసుకుంది. మహా కుంభమేళా సందర్భంగా ఆమె సాధ్విగా మారిపోయింది. ఇప్పటి వరకు మమతా కులకర్ణిగా ఉన్న ఆమె యమయ్ మమతా నందగిరిగా మారారు. 
 
వారణాసిలోని మహా కుంభమేళాలో కిన్నెర అఖాడాలో చేరి ఆమె సాధ్విగా మారిపోయారు. ఆమె మహామండలేశ్వరుడు పదవి కావాలని కోరడంతో ఇచ్చినట్లు మహామండలేశ్వరక లక్ష్మీ త్రిపాఠి తెలిపారు. 
 
మమతా కులకర్ణి ఇటీవల ఇండియాకి వచ్చారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆమె గతేడాది ముంబైలో కనిపించారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఆమె వచ్చారని అందరూ భావించారు. 
 
కానీ అందరికీ షాక్ ఇస్తూ.. ఆమె సన్యాసి పుచ్చుకున్నారు. 1992లో కెరీర్‌ను ప్రారంభించిన కులకర్ణి అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. చివరగా 2002లో సినిమాలు చేయడం ఆపేసింది.