బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (18:05 IST)

మంచు లక్ష్మీ ఇంటిలోనే మనోజ్‌ పెండ్లి రాత్రి 8.30 ఫిక్స్‌

manosh, laxmi
manosh, laxmi
మంచు మనోజ్‌ ద్వితీయ వివాహం జరగబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్త వస్తూనే వుంది. పెండ్లి ఎక్కడజరగనున్నదని చర్చ కూడా జరిగింది. చాలా సీక్రెట్‌గా వార్తను మెయిన్‌ టేన్‌ చేసిన మనోజ్‌ కుటుంబం ఎట్టకేలకు కొద్దిసేపటికి క్రితమే రివీల్‌ చేశారు. మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో తన భార్య మౌనిక అంటూ పోస్ట్‌ చేశాడు. అంగరంగ వైభవంగా మాత్రం పెండ్లి జరగడంలేదు.
 
monika reddy
monika reddy
గత నాలుగురోజులుగా జూబ్లీహిల్స్‌లోని మంచు లక్ష్మీ ప్రసన్న ఇల్లు సందడిగా ఉంది. ఆ ఇంటిలోనే పెండ్లి జరగబోతున్నట్లు రూఢీ అయింది. శుక్రవారం రాత్రి 8.30గంటలకు ముహూర్తం పెట్టారు. ఈరోజు పెండ్లికొడుకు చేస్తున్న ఫొటోను కూడా బయటపెట్టారు. లక్ష్మీమంచు మనోజ్‌కు గంధం పూస్తున్న ఫొటోకూడా పోస్ట్‌ చేశాడు.
 
pinky reddy, manoj
pinky reddy, manoj
ఈ పెండ్లికి మోహన్‌బాబు రావడంలేదనీ వార్తలయితే వినిపిస్తున్నాయి. మంచు విష్ణు కార్యాలయంలోని వారెవ్వరూ ఈ పెండ్లిగురించి ప్రస్తావించడంలేదు