శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (17:05 IST)

ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె గురించి స్క్రాచ్‌ వీడియో చేసిన నాగ్‌ అశ్విన్‌

sctch vedio nag aswin
sctch vedio nag aswin
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తాజా సినిమా ప్రాజెక్ట్‌ కె. ఈ సినిమాకు నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత పార్ట్‌ రామోజీ ఫిలింసిటీలో జరిగింది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పడుకొనే తదితరులు కూడా నటించారు. ఇక 2022 ఏడాది చివరి రోజైన డిసెంబర్‌ 31న నాగ్‌ అశ్విన్‌ ఓ వీడియో విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ కె వర్క్‌షాప్‌ అని రాసివున్న లాబ్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.
 
స్క్రాచ్‌ నుంచి మొదలు అంటూ తెలియజేసిన ఆ వీడియో ఓ పరికరాన్ని పరిశీలిస్తున్న విషయాన్ని తెలియజేశారు. కొందరు మాస్క్‌లతో శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా కనిపిస్తున్నారు. ఈ మిషన్‌ ఏదో టైం మిషన్‌లా అనిపిస్తుంది. కానీ అదేమిటనేది చెప్పలేదు. కొత్త ఏడాది జనవరి 1న అభిమానుల కోసం తెలియజేసేలా ఇలా చేసినట్లు తెలుస్తోంది. అశ్వనీదత్‌ ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు.