బుధవారం, 29 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated: మంగళవారం, 24 జనవరి 2023 (16:04 IST)

అక్కినేని... తొక్కినేని.. బాలయ్య వ్యాఖ్యలపై ఏఎన్నార్ మనమల స్పందన ఇదే...

akkineni nageswara rao
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ తాజా జరిగింది. ఇందులో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, "అక్కినేని.. తొక్కినేని" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
ఇవి వివాదాస్పదమయ్యాయి. పైగా, ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణను టార్గెట్ చేశారు. దీంతో ఈ వివాదం పెద్దిది కాకముందే... అక్కినేని వారసులైన అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌లు స్పందించారు. 
 
"నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వర రావుగారు, ఎస్వీ రంగారావుగారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలను వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం" అంటూ ఈ ఇద్దరు హీరోలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. అయితే, ఈ ప్రకటనలపై బాలకృష్ణ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది.