శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 12 డిశెంబరు 2018 (12:22 IST)

నాకు బాలకృష్ణ ఎందుకు తెలీదు... గొప్ప హాస్యనటుడు... నాగబాబు దెబ్బకు అంతరిక్షం?

ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి నాగబాబును అడిగితే... ఆయనెవరో నాకు తెలియదు అన్నారు. దానితో బాలయ్య ఫ్యాన్స్ ఓ రేంజిలో ఫైరయ్యారు. సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేసి సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో చిర్రెత్తిపోయినట్లుంది మెగా బ్రదర్‌కి.
 
తాజాగా ఆయన మరో వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ తెలియదు అని చెప్పడం తప్పే. ఆయన గొప్ప హాస్య నటుడు. ఆయన నాకు తెలియదనడం తప్పే. నాకు వల్లూరి బాలకృష్ణ తెలుసంటూ ఆనాటి నటుడు బాలకృష్ణ.. అంజిగా పిలిచే నటుడి ఫోటో చూపిస్తూ మాట్లాడారు. 
 
ఈ వీడియో చూసిన బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ ఫైరయ్యారు. ఏం తమాషాగా వుందా నాగబాబూ... వెటకారమా... బాలయ్య తెలియదని చెప్పడమే కాకుండా ఇప్పుడు వెటకారంగా అంజి ఫోటో చూపిస్తారా... మీ అబ్బాయి అంతరిక్షం సినిమాను మేము అడ్డుకుంటాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాగబాబు కామెంట్లు ఎలా వున్నా ఇది వరుణ్ తేజ్‌కు బాగా ఇబ్బంది పెడుతోందని సమాచారం. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.