బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 జనవరి 2025 (16:23 IST)

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

Bad Boy Karthik
Bad Boy Karthik
చలో అంటూ తన కెరీర్ ను ప్రారంభించిన నాగ శౌర్య ఆ తర్వాత కొద్ది సినిమాలు చేశారు. కానీ సరైన హిట్ రాబట్టుకోలేకపోయారు. దానితో పెండ్లి చేసుకుని కొద్దిరోజుల గేప్ తీసుకుని మరలా వెండితెరపైకి వస్తున్నాడు. ఈసారి బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నట్లు ప్రకటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై  శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈరోజు లాంచ్ చేశారు.
 
ఈ చిత్రానికి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే పవర్ ఫుల్ టైటిల్‌ ని ఖరారు చేశారు. టైటిల్ నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వ్యాన్ వెనుక కూర్చుని ఇంటెన్స్ లుక్ తో ఫెరోషియస్ అవతార్ లో కనిపించారు. అతని నుదిటిపై రక్తంతో కూడిన "మూడు గోవింద నామాలు", చేతులపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. వ్యాన్ పై వున్న స్టిక్కర్ ""Hyderabad" లో "BAD" అనే పదాన్ని తొలగించడం అతని పాత్ర దూకుడు స్వభావాన్ని, యాక్షన్-ప్యాక్డ్ స్టయిల్ ని సూచిస్తుంది.
 
ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్నారు. సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకు కమ్ బ్యాక్ ఇస్తూ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ కాగ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
 
షూటింగ్ కంప్లీట్ కావస్తున్న ఈ చిత్రం ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రమోషన్స్ ని ప్రారంభించింది. రెగ్యులర్ అప్‌డేట్స్ తో రాబోతున్నారు మేకర్స్.
 
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ
 
సాంకేతిక సిబ్బంది: డీవోపీ: రసూల్ ఎల్లోర్,  సంగీతం: హారిస్ జైరాజ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పృధ్వి, కొరియోగ్రాఫర్స్: రాజు సుందరం, శోబి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్, లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్