శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (15:35 IST)

#NBK108 : బాలయ్య ఫస్ట్ లుక్ చూశారా?

balakrishna
నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇది బాలకృష్ణ నటించే 108వ మూవీ. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య లుక్ అదిరిపోయింది. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. 
 
గత యేడాది విడుదలైన "అఖండ" చిత్రంలో బాలకృష్ణ నటుకు సినీ ప్రేక్షకులు ఫిదా అయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలకృష్ణ నటన అదిరిపోయింది. ఆఊపులోనే "వీరసింహారెడ్డి" చిత్రంలో నటించారు. గత సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఇపుడు 108వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. "ఎఫ్2" వంటి హాస్యభరిత చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా, ఇందులో "ఈ సారి మీ ఊహకు మించి" అంటూ నటసింహం పోస్టర్లను రిలీజ్ చేసింది. బాలయ్య మాస్ లుక్‌లో అదిరిపోయారని ఫ్యాన్స్ అంటున్నారు.