బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (10:58 IST)

ఎన్టీఆర్ బయోపిక్‌లో దేవాన్ష్, శౌర్యరామ్.. మోక్షజ్ఞను వద్దన్నారు..

ఎన్టీఆర్ బయోపిక్‌ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ.. స్వర్గీయ నందమూరి తారకరామారావు పాత్రలో కనిపించనున్నారు. ఇక బాల ఎన్టీఆర్‌గా నారా, నందమూరి వంశాల వారసుడు, లోకేష్ కుమారుడ

ఎన్టీఆర్ బయోపిక్‌ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ.. స్వర్గీయ నందమూరి తారకరామారావు పాత్రలో కనిపించనున్నారు. ఇక బాల ఎన్టీఆర్‌గా నారా, నందమూరి వంశాల వారసుడు, లోకేష్ కుమారుడు దేవాన్ష్‌తో పాటు కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్యరామ్ కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్నట్లు ఇప్పటికే ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తొలుత యువ ఎన్టీఆర్ పాత్రకు మోక్షజ్ఞను ఎంపిక చేయాలని చిత్ర దర్శకుడు తేజ భావించినా, బాలయ్య సున్నితంగానే తిరస్కరించినట్టు తెలుస్తోంది. సోలో హీరోగా తీసే సినిమాతోనే మోక్షజ్ఞ తెరంగేట్రం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు.