శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (11:57 IST)

ర‌ణ్‌వీర్‌తో డేట్ చేస్తా.. సంజయ్‌ను పెళ్లాడతానంటున్న "పద్మావతి"

బాలీవుడ్ "పద్మావతి" దీపికా పదుకొనే తన మనసులోని మాటను వెల్లడించింది. ఈ చిత్రం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని పెళ్లాడనున్నట్టు ప్రకటించింది. హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అడిగ

బాలీవుడ్ "పద్మావతి" దీపికా పదుకొనే తన మనసులోని మాటను వెల్లడించింది. ఈ చిత్రం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని పెళ్లాడనున్నట్టు ప్రకటించింది. హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అడిగిన ప్రశ్నకు దీపికా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.
 
నిజానికి 'ప‌ద్మావ‌తి' చిత్రం డిసెంబర్ ఒకటో తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఓ వర్గం నుంచి వచ్చిన బెదిరింపుల కారణంగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు. కానీ, ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. 
 
ఈనేప‌థ్యంలో న‌టి దీపికా ప‌దుకునే బిగ్‌బాస్ కార్య‌క్రమానికి విచ్చేసింది. ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యాత స‌ల్మాన్ ఖాన్, దీపికాతో ఒక గేమ్ ఆడించాడు. దాని పేరు డేట్‌, మ్యారీ, కిల్‌. ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ, నటులు ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌ల‌లో ఎవ‌రితో ఏం చేస్తావో చెప్పాల‌ని అడిగాడు.
 
అందుకు దీపికా... భ‌న్సాలీని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. దానికి కంగుతిన్న స‌ల్మాన్... స‌రే! కొద్ది రోజుల వ‌ర‌కైతే ఓకే అంటూ కౌంట‌ర్ వేశాడు. త‌ర్వాత దీపికా... ర‌ణ్‌వీర్‌తో డేట్ చేస్తాన‌ని, షాహిద్‌ని చంపుతాన‌ని చెప్పింది. షాహిద్ ఎందుకు చంపాల‌నుకుంటున్నావని స‌ల్మాన్ అడ‌గ్గా.. అత‌నికి పెళ్లైంది క‌దా! అంటూ చ‌మ‌త్క‌రించింది. త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ఆఫ్‌బీట్ డ్యాన్స్ వేశారు. పాట‌కి సంబంధం లేకుండా డ్యాన్స్ వేయ‌డంలో ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ్డారు.