శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 15 సెప్టెంబరు 2018 (15:31 IST)

సమంత, తమన్నా బాటలో పాయల్.. ఐటమ్‌ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్

ఆర్ఎక్స్ 100 హీరోయిన్.. పాయల్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అయితే కథకు గల ప్రాధాన్యతను బట్టి పాయల్ సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. పాయల్ తొలి సినిమా అయిన ఆర్ఎక్స్ 100లో గ్లామర్ పంట పండించిన సంగతి తెల

ఆర్ఎక్స్ 100 హీరోయిన్.. పాయల్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అయితే కథకు గల ప్రాధాన్యతను బట్టి పాయల్ సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. పాయల్ తొలి సినిమా అయిన ఆర్ఎక్స్ 100లో గ్లామర్ పంట పండించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాయల్ రాజ్‌పుత్‌కి యూత్ నుంచి మంచి క్రేజ్ లభించింది. తెలుగులోనే కాకుండా తమిళం నుంచి కూడా ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఆచితూచి మంచి రోల్స్ ఎంపిక చేసుకుంటుంది.
 
తాజాగా పాత్ర నచ్చిన కారణంగా ఒక తెలుగు సినిమాలో కథానాయికగా ఆమె అంగీకరించింది. మరో సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి పాయల్‌ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అదుర్స్ అనిపించే స్థాయిలో ఆ సాంగ్ ఉండటమే అందుకు కారణమని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో సమంత, తమన్నా ఐటమ్ సాంగ్ కోసం చిందేసిన సంగతి తెలిసింది. ప్రస్తుతం వీరి బాటలోనే పాయల్ కూడా ఐటమ్ గర్ల్‌గా మారనుంది.