మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (13:28 IST)

రామ్‌చరణ్‌తో ఐటమ్ సాంగా..? చేయనంటే చేయను.. పాయల్

అఖిల్, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం ఆర్ఎక్స్100 హీరోయిన్ పాయల్‌ను సంప్రదించారట. అయితే సెకండ్ హీరోయిన్ పాత్రలను పాయల్ రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోష

అఖిల్, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం ఆర్ఎక్స్100 హీరోయిన్ పాయల్‌ను సంప్రదించారట. అయితే సెకండ్ హీరోయిన్ పాత్రలను పాయల్ రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాజల్ అగర్వాల్, బెల్లకొండ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా పాయల్ రాజపుట్‌ని సంప్రదించడమే కాకుండా.. అడిగినంత పారితోషకం ఆఫర్ చేసినా… సెకండ్ హీరోయిన్ పాత్రలు చెయ్యనని పాయల్ తేల్చేసిందట. 
 
తనకి మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఉంటే చెప్పమని దర్శకనిర్మాతలతో చెప్పిందట. అంతేగాకుండా.. రామ్ చరణ్- బోయపాటి సినిమాలో ఐటెం సాంగ్ కోసం పాయల్‌ని సంప్రదించగా.. తాను హీరోయిన్‌గా మాత్రమే చేస్తానని.. ఇప్పుడిప్పుడే ఐటెం సాంగ్స్ చెయ్యనని ఖరాఖండిగా చెప్పేసిందట.