సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (22:27 IST)

సల్మాన్ ఖాన్ సినిమాలో పూజా హెగ్డే బతుకమ్మ పాటకు డాన్స్ వేసింది (video)

Pooja batukamma song
Pooja batukamma song
ఒక ప్రాంత సంస్కృతిని గౌరవించే పాటలు, సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ గౌరవిస్తారు. తెలంగాణా బతుకమ్మ పండుగను ఈ మధ్య తెలుగు సినిమాలందరూ ఆవిష్కరిస్తున్నారు. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. ఓ బాలీవుడ్ సినిమా బతుకమ్మ సంప్రదాయాన్ని అంతటి చిత్తశుద్ధితో గౌరవించింది.
 
Salman khan enters song
Salman khan enters song
బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్', ప్రసిద్ధ పండుగ తర్వాత అనే పాట ద్వారా స్థానిక సంప్రదాయానికి గొప్ప నివాళి అర్పించింది. ప్రామాణికమైన నేపథ్యంలో చిత్రీకరించబడిన ఈ పాటలో హీరో వెంకటేష్ కూడా ఉన్నారు. మాస్ హీరో సల్మాన్ ఖాన్ సంప్రదాయ దుస్తుల్లో చివర్లో ఎంట్రీ ఇచ్చాడు.

 
 


 
'అల వైకుంఠపురములో' అందం సంప్రదాయ వస్త్రధారణలో చాలా అందంగా పూజా హెగ్డే కనిపిస్తుంది. ఇందులో బతుకమ్మ పాటకు డాన్స్ చేసింది. ఈరోజు పాట విడుదల చేశారు. పాట విడుదల సందర్భంగా  పూజా హెగ్డే మాట్లాడుతూ, గొప్ప భారతీయ సంస్కృతిలో బతుకమ్మ ఒక రకమైన పండుగ అని అన్నారు. "తెలంగాణలోని మహిళలు చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పాట ద్వారా 'బతుకమ్మ' పండుగలో నేను భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను, తెలంగాణ అందమైన పూల పండుగకు నివాళి అని తెలిపారు. ఈద్‌కు సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.