మంగళవారం, 25 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2025 (12:59 IST)

Modi: ఇంగ్లీష్ లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ మా వందే ప్రకటన

Modi's biopic Maa Vand
Modi's biopic Maa Vand
దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను మా వందే టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్.

Unni Mukundan and team
Unni Mukundan and team
సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని మా వందే సినిమాలో చూపించనున్నారు. ఈ రోజు మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేశారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వీర్ రెడ్డి.ఎం. మాట్లాడుతూ - మోదీ గారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని సంఘటనలు, విశేషాలన్నీ ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్న సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందే మా వందే చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ నిర్మిస్తున్నాం. 
 
ప్రపంచనాయకుడిగా మోదీ ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఇచ్చిన ప్రేరణ, తల్లితో మోదీకి గల అనుబంధం ఈ చిత్రంలో భావోద్వేగాలను పంచనుంది. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఈ కథలో కీలకాంశంగా ఉండనుంది. మచ్చలేని నాయకుడిగా దేశ సేవకే జీవితాన్ని అంకితం చేస్తున్న ప్రధాని మోదీ జీవిత విశేషాలను "మా వందే" సినిమాటిక్ యూనివర్స్ లో ప్రేక్షకులందరికీ నచ్చేలా ఆవిష్కరించబోతున్నాం