గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జులై 2022 (15:40 IST)

శ్రీజ మూడో పెళ్లి.. పూజిత సంచలన వ్యాఖ్యలు.. అడ్జస్ట్ కాకపోవడమే?

Srija
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో వివాహం చేసుకోబోతోందనే వార్తలపై ప్రముఖ సీనియర్ నటి పూజిత స్పందించారు. పూజిత మాట్లాడుతూ చిరంజీవి గారు సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి. కానీ ఆయన కూతురు శ్రీజ మాత్రం ఇలా మూడో పెళ్లి చేసుకుని ఆయన పరువు కూడా తీస్తోంది. ఆమె బిహేవియర్ ఏమాత్రం పద్ధతిగా లేదు అంటూ తెలిపింది. 
 
నిజానికి వాళ్ల కుటుంబ విషయాలు నాకు పెద్దగా తెలియవు.. కాబట్టి ఇంతవరకే మాట్లాడగలను అంటూ ఒకపక్క పూజిత చెబుతూనే మరొక పక్క తన తండ్రి పరువు గురించి ఆలోచించి మూడవ పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటూ ఆమె తెలిపింది. 
 
ఇక చాలా గారాబంగా పెరగడం వల్లే శ్రీజ ఎవరితో కూడా అడ్జస్ట్ కావడం లేదు అంటూ తెలిపింది పూజిత.. ఇక నిజానికి తన తండ్రికి తెలియకుండా ఆర్య సమాజంలో ఒక అబ్బాయిని వివాహం చేసుకున్న శ్రీజ, ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత అతడితో విడాకులు తీసుకుంది. 
 
ఇక చిరంజీవి సలహా మేరకు కళ్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకున్న ఈమె మరొక పాపకు జన్మనిచ్చింది. ఇప్పుడు అతడితో కూడా విడాకులు తీసుకొని.. మూడో వివాహం చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.