సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (17:29 IST)

బాబు మోహన్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న రెడ్డి మల్టీప్లెక్స్ మూవీస్

Clap by Babu Mohan
Clap by Babu Mohan
మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. ప్రొడక్షన్ హౌస్ లో లాంగ్ టర్మ్ ప్లానింగ్‌తో వరుస సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత విజయ్ రెడ్డి చెప్పారు.  అందులో భాగంగా సోమవారం రామానాయుడు స్టూడియోస్ ఆవరణలో మూడు సినిమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కిస్తున్న సినిమా 'సోషల్ వర్కర్స్'. ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ కథతో రూపొందుతున్న చిత్రమిది.
 
మహేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 2వ సినిమా 'కోబలి'. ఇందులో మిత్ర ప్రధాన పాత్రధారి. మరియు సహ నిర్మాత.
 
'సోషల్ వర్కర్స్', 'కోబలి' సినిమా పూజా కార్యక్రమాలకు ప్రముఖ నటుడు బాబు మోహన్, పలువురు రాజకీయ నాయకులు అతిథులుగా హాజరు అయ్యారు. పూజ అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలతో పాటు 'హ్యాపీ విమెన్స్ డే' సినిమాను కూడా సంస్థ ప్రకటించింది.  
 
బాబు మోహన్ మాట్లాడుతూ ''ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 20 సినిమాలు ప్లాన్ చేశారు. రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. 'సోషల్ వర్కర్స్' సినిమా ఓపెనింగ్ కు నన్ను పిలిచారు. ఆ తర్వాత ముందు నుంచి ఈ సినిమాలో ఓ పాత్రకు నన్ను అనుకుంటున్నట్లు చెప్పారు. అలా ఈ సినిమాలో నేనూ ఓ భాగం అయ్యాను. ఇది కాకుండా 'కోబలి' అని 'అరుంధతి' తరహాలో మరో సినిమా చేస్తున్నారు. మంచి ఉద్దేశంతో విజయ్ రెడ్డి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 
 
విజయ్ రెడ్డి మాట్లాడుతూ ''ముంబైలో మేం ఈ కార్పొరేట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాం. అన్ని భాషల్లో థియేట్రికల్, ఓటీటీ సినిమాలు తీస్తాం. త్వరలో 'సోషల్ వర్కర్స్' సినిమా స్టార్ట్ చేస్తాం. సినిమా రంగంలో బాధలు దీని కథాంశం. తర్వాత 'కోబలి' సెట్స్ మీదకు వెళుతుంది. అది హారర్ బేస్డ్ యూత్ ఫిల్మ్. విశాఖలో రెండు సినిమాలు తీయాలని ప్లాన్ చేశాం. త్వరలో వాటిని అనౌన్స్ చేస్తాం. కథలు రెడీ చేసుకున్న ఔత్సాహిక దర్శకులు గానీ, చిత్రసీమలో రాణించాలనుకుంటున్న నటీనటులు మమ్మల్ని సంప్రదించండి'' అని చెప్పారు. 
 
'కోబలి' దర్శకుడు మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ ''దైవశక్తి, క్షుద్రశక్తి మధ్య జరిగే యుద్ధంతో తీస్తున్న చిత్రం "కోబలి". మే లేదా జూన్ నెలలో తూర్పు గోదావరి జిల్లాలో చిత్రీకరణ చేద్దాం అనుకుంటున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు. 
 
'సోషల్ వర్కర్స్' దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ ''సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో కథ ఉంటుంది. ఇండస్ట్రీలో పరిస్థితులను సినిమాలో చూపిస్తున్నాం. ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారు. అందరివీ ప్రాముఖ్యం ఉన్న పాత్రలు అని తెలిపారు.