ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2023 (11:36 IST)

ఊర మాస్‌గా 'గంజా శంకర్' - వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన మేకర్స్....

gaanja shankar
సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ - సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న గాంజా శంకర్‌ సినిమాలో వీడియో గ్లింప్స్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేనంత మాస్‌ లుక్‌లో సాయిధరమ్ తేజ్ కనిపించాడీ గ్లింప్స్, మాస్క్ నిర్వచనం వద్దని, ఫీల్ అవమని చెబుతూ గ్లింప్స్‌ను మొదలుపెట్టారు. 'స్పెడర్ మ్యాన్.. సూపర్ మ్యాన్ కాదు నాన్న.. మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు' అని చిన్నారి అడగడంతో ఇంట్రో మొదలైంది.
 
ఫస్ట్ హైలోనే హీరో కేరెక్టర్‌ను మేకర్స్ రివీల్ చేసేశారు. చదువు మానేసి, చెప్పిన మాట వినకుండా పెడదారి పట్టినట్టు అర్థమవుతోంది. అంతేకాదు, జర్దా, గుట్కా, మద్యం వంటి అన్ని దరిద్రమైన అలవాట్లు ఉన్నట్టు కూడా చెప్పేశారు. హీరో గంజా స్మగ్లర్ అని కూడా టైటిల్‌‍ను బట్టి తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో కథ సాగుతున్నట్టుగా అనుపిస్తోంది.
 
సాయి ధరమ్ తేజ్ నటించిన 17వ చిత్రం కావడం గమనార్హం. త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి సౌజన్య నిర్మాతగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ కోసం పూజాహెగ్డే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.