గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (22:01 IST)

సమంత-చిన్మయి స్నేహం అలాంటిది...

Samantha
సమంత మయోసైటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కాగా ఇటీవల సమంత ఆరోగ్యం కాస్త కుదుట పడింది.
 
తాజాగా సమంత బాలీవుడ్ ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తోన్న సీటాడెల్‌లో న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే చాలా రోజుల త‌ర్వాత త‌న బెస్ట్‌ఫ్రెండ్ చిన్మ‌యిపై స‌మంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.
 
సీటాడెల్‌‌లోకి సమంత ఎంట్రీతో చిత్ర యూనిట్ నుంచి స్వాగ‌తం చెబుతూ ఓ పోస్ట్ విడుదల చేసింది.. ఆ పోస్ట్‌పై సమంత స్నేహితురాలు చిన్మ‌యి భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ స్పందించాడు. చిన్మయి కూడా సమంత పోస్టుపై సానుకూలంగా స్పందించింది.