గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (14:51 IST)

'యశోద' చిత్రం ఇమాజినరి చిత్రమా? ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

yashoda
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "యశోద". ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. దీన్ని పరిశీలిస్తే, సమంత ఓ ఆస్పత్రిలో బెడ్ పై నుంచి అకస్మాత్తుగా లేచి చేతికి ఉన్న బాండ్‌ను ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత కిటికీ బయట ఉన్న పావురాన్నితాకబోతుంది. ఆ వెంటనే యశోద టైటిల్ వస్తుంది. కథపై ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఎలాంటి డైలాగ్స్ లేకుండా మేకర్స్ ఈ గ్లింప్స్‌ను కట్ చేశారు. 
 
ఇక ఈ గ్లింప్స్‌ని చూస్తే స‌మంత ఇమాజిన‌రి ప్ర‌పంచంలో ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రం స‌మంత‌కు మొద‌టి పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల కాబోతుంది. ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. 
 
మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది.