1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (17:44 IST)

మార్టిన్ లూథర్ కింగ్‌‌కు వస్తోన్న సంపూర్ణేష్

Sampoornesh Babu
Sampoornesh Babu
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. స్పూఫ్‌ కామెడీతో రూపొందిన ఈ చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించాయి. హృదయ కాలేయం క్రేజ్‌తో సంపూర్ణేష్ బాబు తెలుగులో చాలా సినిమాలు చేసినా సక్సెస్‌ని అందుకోలేకపోయాడు. 
 
చాలా గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు పొలిటికల్ కామెడీ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళవారం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
సంపూర్ణేష్ బాబు తలపై కిరీటం పెట్టుకుని ఓట్ల కోసం ప్రచారం చేస్తున్న కొందరు నేతలు విభిన్నంగా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో పాటు దర్శకుడు వెంకటేష్ మహా, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన మేకర్స్.. ఇది కోలీవుడ్ రీమేక్ అని సమాచారం. మండేలా సినిమా ఆధారంగా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 
 
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. దీనికి పూజా కొల్లూర్ దర్శకత్వం వహించారు. ఇది YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్ మధ్య సహకార వెంచర్‌తో తెరకెక్కుతోంది.