సోలో బ్రతుకే సో బెటర్.. ఓటీటీలో విడుదల అవుతుందా?

Solo Brathuke So Better
సెల్వి| Last Updated: శనివారం, 1 ఆగస్టు 2020 (12:07 IST)
Solo Brathuke So Better
దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''సోలో బ్రతుకే సో బెటర్''. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. తేజు సరసన నభ నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌కి మంచిరెస్పాన్స్ వచ్చింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ అయిన అమేజాన్, నెట్ ఫ్లిక్స్, జీ-5, సన్ నెక్స్ట్, ఆహా, హాట్ స్టార్ ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేస్తున్నాయట. దీంతో ఓటీటీలో తేజు సినిమా విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోందని టాక్ నడుస్తోంది. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన తేజు.. సోలో బ్రతుకే సో బెటర్‌‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.దీనిపై మరింత చదవండి :