మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 జులై 2022 (11:06 IST)

సీనియ‌ర్ న‌రేశ్‌ విలాసపురుషుడా? ఇన్ని పెళ్లిళ్లు ఎందుకో?

Sr. Naresh, Pavitra Lokesh, Ramya
Sr. Naresh, Pavitra Lokesh, Ramya
విజ‌య విజ‌య నిర్మ‌ల‌ కొడుకుగా సీనియ‌ర్ స‌రేశ్ అంద‌రికీ తెలిసిందే. ఆమె బ‌తికుండ‌గానే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మూడో పెండ్లి త‌ర్వాతే విజ‌య‌నిర్మ‌ల‌గారు మ‌ర‌ణించ‌డంతో న‌రేశ్‌కు రెక్క‌లు వ‌చ్చిన‌ట్లుగా వున్నాయ‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. న‌రేశ్ వ్య‌క్తిగ‌తం ప‌రిశీలిస్తే ఆయ‌న మొద‌టినుంచి విలాస పురుషుడు. ఇప్ప‌టికే మూడు పెండ్లిళ్లు జ‌రిగాయి.


మొదటి వివాహం సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించాడు. ఆ తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత మేక‌ప్‌మేన్‌, వ్య‌క్తిగ‌త స‌ల‌హాదారిణి అయిన ప‌ద్మను వివాహం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు 50ఏళ్ళ త‌ర్వాత మూడో వివాహం చేసుకున్నాడు. రాజకీయవేత్త‌ రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న హిందూపురంలో వివాహం చేసుకున్నాడు. ఆమెకి ముగ్గురు కొడుకులున్నారు.

 
మూడో వివాహ‌మే గొడ‌వ ఎందుక‌యింది?
ఇంత‌వ‌ర‌కు రెండు వివాహాలు చేసుకున్నా.. లేని గొడ‌వ ర‌మ్య విష‌యంలో అవ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు. రాజ‌కీయ కోణం కార‌ణంగా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. న‌రేశ్ బి.జె.పి. తీర్థం  తీసుకుని రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకున్న టైంలో ఆ పార్టీనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈలోగా సినిమాల్లో న‌టుడిగా బిజీ కావ‌డంతో బెంగుళూరుకు చెందిన న‌టి ప‌విత్ర‌ా లోకేష్‌తో స‌న్నిహితం ఏర్ప‌డింది. ఆమెను తాను న‌టించే ప్ర‌తి సినిమాలో వుండేలా చూసుకునేవాడు. అంత‌వ‌ర‌కు బాగానే వుంది. 

 
ఆ త‌ర్వాత ఐదేళ్ళ క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌విత్ర‌లోకేష్ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తూ ఇతర న‌టీనటుల‌ను స‌పోర్ట్‌గా నిలిచేలా చేసింది. అందుకు ఆమెకు త‌న వ్య‌క్తిగ‌త స‌ల‌హాదారునిగా న‌రేష్ నియ‌మించుకున్నారు. అప్ప‌టినుంచి వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. మా అధ్య‌క్షుడిగా వున్న‌త‌రుణంలో వీరిద్ద‌రూ విదేశాల‌కు వెళ్ళివ‌చ్చారు. అయితే అప్ప‌టికే మూడో భార్య ర‌మ్య విడాకుల ప‌ర్వం బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
ఎందుకు ఇంకా విడాకులు ఇవ్వ‌లేదంటే..
ర‌మ్య‌కూ న‌రేశ్‌తో రెండో వివాహం. కానీ, న‌రేశ్ ఆమె నుంచి విడిపోవ‌డానికి నిర్ణ‌యించుకున్నాక ర‌మ్య కోర్టులో కేసు వేసింది. న‌రేశ్ ఆస్తిలో స‌గం వాటా కావాల‌ని నిబంధ‌న పెట్టింది. ఇది ఇరు లాయ‌ర్లు స‌మ‌క్షంలో అంగీకారం కుదిరింది. కొంత మొత్తం ఇచ్చ‌లే ప్లాన్ చేశారు.న‌రేశ్ వాద‌న ఎలా వుందంటే, త‌న కారుడ్రైవ‌ర్‌తో ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఆ టైప్ మ‌నిషి అంటూ విమ‌ర్శ‌లు చేశాడు. కారుడ్రైవ‌ర్ స‌మ‌క్షంలో కొంత మొత్తాన్ని ఇచ్చాను. కానీ మ‌ర‌లా మాట మార్చి ఇలా నా విష‌యంలో అవాకులు చెవాకులు పేలుతుంద‌ని, పూర్తి వివ‌రాల‌తో మీముందుకు వ‌స్తానంటూ న‌రేశ్ చెప్ప‌డం విశేషం.
 
Naresh house-Software compiens
Naresh house
ఆస్తి విలువ వేల‌కోట్ల‌లోనే
విజ‌య నిర్మ‌ల మొద‌టి భ‌ర్త కొడుకు న‌రేశ్‌. కృష్ణ‌తో స‌హ‌జీవ‌నం చేశాక వీరిద్ద‌రూ పిల్ల‌లు వ‌ద్ద‌నుకుని క‌ట్టుబాటుతోనే జీవ‌నం సాగించారు. విజ‌య‌నిర్మ‌ల‌గారు వ్యాపార‌ ప్ర‌ణాళిక‌లో దిట్ట‌. శోభ‌న్‌ బాబులా డ‌బ్బులు వున్న‌ప్పుడు స్థ‌లాలు కొన‌డం చేస్తుండేది. బెంగుళూరు, చెన్నైల‌లో ఆస్తులు కూడ‌పెట్ట‌బారు. హైద‌రాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో విలాస‌వంత‌మైన ప్రాంతంలో రెండు ఇళ్ళు కూడా వున్నాయి. నాన‌క్‌రామ్ గూడ సినీవిలేజ్‌లో 10 ఎక‌రాల స్థ‌లం కొనుగోలు చేశారు. అప్ప‌ట్లో సినిమా క‌థ‌ల చ‌ర్చ‌ల‌కు చాలామంది ఇక్క‌డికే వ‌చ్చేవారు.


ఆ త‌ర్వాత కొన్ని విమ‌ర్శ‌ల‌కు గుర‌వ‌డంతో రూమ్‌ల‌న్నీ ఖాళీచేసేసి రీ మోడ‌ల్ చేశారు. చుట్టూ చెట్ల‌తో అందంగా వుండే ఆ ప్రాంతంలో ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీల‌కు లీజుకు ఇచ్చేశారు. మ‌రికొంత భాగాన్ని  అద్దెకు ఇచ్చారు. ఇంచుమించు నెల‌కు కోటిరూపాయ‌ల‌కుపైగానే అద్దె రూపంలో ఆదాయం వ‌చ్చేది. ఇదంతా విజ‌య‌నిర్మ‌ల‌గారు బ‌తికుండ‌గానే జ‌రిగేది. ఇక ఆమె మ‌ర‌ణానంత‌రం వార‌సుడిగా న‌రేశ్ ఒక్క‌డే. దాంతో కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌చ్చిప‌డుతుంటే విలాస‌పురుడైన న‌రేశ్‌కు రెక్క‌లొచ్చేశాయంటూ సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.

 
పెండ్లి చేసుకుంటాం- న‌రేశ్‌
ఈ గొడ‌వ ఇలా జ‌రుగుతుండ‌గా.. ర‌మ్య మా వివాహంపై ఇంత ర‌భ‌స చేస్తుంది కాబ‌ట్టి మా ఇష్ట‌మైన‌ప్పుడు ప‌విత్ర నేను పెండ్లి చేసుకుంటాం. లేదంటే కలిసి వుంటామంటూ బాహాటంగానే న‌రేశ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ర‌మ్య‌, న‌రేశ్ ఉదంతం ఇలా ర‌చ్చ‌కావ‌డం వ‌ల్ల ర‌మ్య త‌నంత తానుగా విడాకుల‌కు కాంప్ర‌మైజ్ అవుతుంద‌నే లాజిక్‌తో న‌రేశ్ ఉన్నాడ‌ని సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. కానీ ర‌మ్య ఇంత జ‌రిగాక‌ మొండి ప‌ట్టుద‌ల‌తో ఆస్తిలో స‌గం వాటా కావాల‌నే తేల్చి చెబుతుంది. చివ‌రికి ఎటువంటి తీర్పు కోర్టు ఇస్తుందో చూడాలి.