సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2024 (16:32 IST)

సుధీర్ బాబు, మాళవిక శర్మ నటిసున్న 'హరోం హర' నుంచి సోల్ ఫుల్ మెలోడీ విడుదల

Sudhir Babu  Malavika Sharma
Sudhir Babu Malavika Sharma
చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే హరోం హర కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. సునీల్ కీలక పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ది రివోల్ట్ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్‌తో ప్రారంభమయ్యాయి. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెకెండ్ సింగిల్‌ని ఈ రోజు విడుదల చేశారు. .
 
చైతన్ భరద్వాజ్ స్వరపరిచి కనులెందుకో సోల్ ఫుల్ మెలోడీని నిఖితా శ్రీవల్లి,  చైతన్ భరద్వాజ్ అద్భుతంగా అలపించారు. కీబోర్డ్ నోట్స్‌తో పాటు అకౌస్టిక్ గిటార్, బాస్, ఎలక్ట్రిక్ మాండొలిన్ ఇంపాక్ట్ ని పెంచుతుంది. వెంగీ ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించాడు.
 
సుధీర్ బాబుని బయట కలవడం గురించి మాళవిక హింట్ ఇవ్వడం పాట ప్రారంభమవుతుంది. ఇద్దరూ కలిసి కొంత క్యాలిటీ టైం  గడపడానికి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లడంతో వారి ప్రేమ ప్రయాణం ప్రారంభమవుతుంది. పాటలో వారి కెమిస్ట్రీ ప్లజెంట్ గా వుంది. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కనులెందుకో మంచి కంపోజిషన్ తో ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
 
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు మేకర్స్.