బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (16:38 IST)

బ్రహ్మాస్త్ర నుంచి పాట విడుద‌ల చేసిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి

Ranbir Kapoor, Alia Bhatt
Ranbir Kapoor, Alia Bhatt
సోషియో ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వ‌హించారు.శుక్ర‌వారంనాడు ఈ చిత్రం నుంచి  మొదటి పాట కుంకుమల వీడియో గ్లింప్స్ ను ఎస్‌.ఎస్‌. రాజమౌళి విడుదల చేసారు. కేసరియా అనే పాట హిందీ వ‌ర్ష‌న్‌. ఇది కూడా విడుద‌లైంది. ప్రీతమ్ స్వరపరచగా, సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట చాలా బాగుంది. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ లు నటిస్తున్న ఈ బహుభాషా బిగ్గీ సెప్టెంబర్ 9, 2022 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
 
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ మాగ్నమ్ ఓపస్ 09.09.2022 న 5 భారతీయ భాషలలో - హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో  థియేటర్‌లలో విడుదల కానుంది.