మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (12:22 IST)

వారసుడులో 8మంది హీరోలున్నారు : దిల్‌రాజు

Dil raju ph
Dil raju ph
విజయ్‌ నటించిన వారసుడు సినిమాలు తెలుగులో జనవరి 14న విడుదలైంది. ఈ సినిమా చూశాక అందరూ ఫ్యామిలీ సినిమా అని అంటున్నారు. తమిళనాడు విజయ్‌ అభిమానులు ఈ సినిమాను మంచి సక్సెస్‌ చేశారు. తెలుగులో సినిమా చూసిన ప్రాంతాల్లో వీడియోల్లో చాలా మంది ఈ సినిమాపై నెగెటివ్‌ టాక్‌ లేకుండా చెబుతున్నారంటే ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులకు దగ్గరయిందో అర్థం చేసుకోవచ్చు.
 
ఇక ఈ సినిమాలో విజయ్‌ ఒక్కడే హీరో కాదు. విజయ్‌తోపాటు శరత్‌ కుమార్‌, శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, ఎస్‌.జె. సూర్య, శ్యామ్‌, సుమన్‌, ప్రభు వీరంతా హీరోలు చేశాకనే పలు రకాల పాత్రలతో మెప్పిస్తున్నారు. అందుకే మా వారసుడులో మొత్తం 8మంది హీరోలున్నారంటూ దిల్‌ రాజు పేర్కొన్నారు. సంగీత, జయసుధ కూడా ఒకప్పటి హీరోయిన్లు. అంటూ తెలిపారు. మరి 8మంది హీరోలుంటే ఎంత సక్సెస్‌ అవ్వాలో కదా!