బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (18:26 IST)

అమీర్ ఖాన్ కృష్ణుడిగా నటిస్తాడా? కర్ణుడిగా నటిస్తాడా?

'మహాభారతం' వెండితెరపై తెరకెక్కనుంది. ఈ మహాభారత భారీ ప్రాజెక్టులో అమీర్ ఖాన్ కృష్ణుడి పాత్రను పోషిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కాలమిస్ట

'మహాభారతం' వెండితెరపై తెరకెక్కనుంది. ఈ మహాభారత భారీ ప్రాజెక్టులో అమీర్ ఖాన్ కృష్ణుడి పాత్రను పోషిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కాలమిస్ట్ ఫ్రాంకోయిస్ గ్వాటియర్ ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. ముస్లిం అయిన అమీర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించడం ఏమిటి అంటూ గ్వాటియర్ ప్రశ్నించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. మహ్మద్ ప్రవక్త పాత్రలో ఓ హిందువు నటించేందుకు ముస్లిం మతస్థులు ఒప్పుకుంటారా? అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే గ్వాటియర్ వివాదాస్పద ట్వీట్‌కు ప్రముఖ పాటల రచయిత జావేద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. ఫ్రాన్స్‌కు చెందిన దర్శకుడు పీటర్ బ్రూక్స్ ''ది మహాభారత్''ను తెరకెక్కించలేదా? అని అడిగారు. ఇంకా గ్వాటియర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్వాటియర్ ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు చేయమని ఏ విదేశీ ఏజెన్సీ డబ్బులిస్తోందంటూ మండిపడ్డారు.
 
ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలు పోషించడంలో ముందుండే అమీర్ ఖాన్‌ మహాభారతంపై కొత్త వార్త చక్కర్లు కొడుతున్నాయి. అమీర్ ఖాన్ మహాభారతంలో ఓ కీలక పాత్రను పోషించనున్నారని తెలుస్తోంది. ఇలాంటి ఇతిహాసంలో తనకు నటించాలని ఉందని, ముఖ్యంగా కృష్ణుడు, కర్ణుడు పాత్రలంటే తనకెంతో ఇష్టమని గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా అమీర్ ఖాన్ మీడియా సమక్షంలో తెలియజేసినట్లు ''ఆఫ్టర్ అవర్స్'' కథనం పేర్కొంది.
 
అలాగే కృష్ణుడి పాత్రకే ఆయన మొగ్గుచూపే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి. కానీ అమీర్ ఖాన్ కర్ణుడు పాత్రలో కనిపించే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం. మరోవైపు మహాభారత భారీ ప్రాజెక్టుకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు బిటౌన్‌లో చర్చ సాగుతోంది.