శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: ఆదివారం, 28 జనవరి 2018 (21:09 IST)

జడపదార్థం... అలసత్వం వుంటే ఏమవుతుందనడానికి ఇదే ఉదాహరణ...

పూర్వం ఒక ఒంటె బ్రహ్మదేవుడ్ని గురించి చాలాకాలం తపస్సు చేసింది. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహానుభావా, నా మెడ నూరు యోజనాల పొడవు పెరిగేట్లు అనుగ్రహించండి అని వరం కోరుకుంది. అలాగే తథాస్తు అని బ్రహ్మ అంతర్థానమయ్యాడు. వరం సంపాదించాననే గర్వంతో ఎవరి స

పూర్వం ఒక ఒంటె బ్రహ్మదేవుడ్ని గురించి చాలాకాలం తపస్సు చేసింది. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహానుభావా,  నా మెడ నూరు యోజనాల పొడవు పెరిగేట్లు అనుగ్రహించండి అని వరం కోరుకుంది. అలాగే తథాస్తు అని బ్రహ్మ అంతర్థానమయ్యాడు. వరం సంపాదించాననే గర్వంతో ఎవరి సహాయం కోరకుండా, ఎవరితోనూ కలిసిమెలసి వుండక, ఒంటరిగా బద్ధకంగా జడపదార్థంలా వుంటూ వుండేది ఒంటె. 
 
ఓసారి ఓచోట కదలకుండా పడుకుని తన పొడుగాటి మెడ చాచి అడవిలో ఓ చోట మేస్తోంది. అప్పుడే పెద్దగాలి, వాన వచ్చింది. ఆ ఒంటె వెంటనే తన తలను ఓ గుహలోకి దూర్చి హాయిగా నిద్రపోయింది. ఇంతలో ఓ నక్క తన భార్యను వెంట పెట్టుకుని ఆ గుహలోకి వచ్చింది. రెంటికీ ఆకలి మండిపోతుందేమో అందులో వున్న ఒంటె మెడ అమృతంలా కనిపించింది వాటికి. 
 
ఆబగా కొరుక్కు తినడం ప్రారంభించాయి. ఒంటెకు నొప్పి కలిగి మెడ విదిలించేసరికి నక్కలు రెండూ నరాలు గట్టిగా కొరికాయి. పాపం.. ఒంటె ఇంక మెడను వెనక్కి తీసుకునే అవకాశం లేక చచ్చి, ఆ నక్కలకు ఆహారమైంది. అందుకే అలసత్వం పనికిరాదు.