శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 మార్చి 2018 (17:15 IST)

'యూ స్కౌండ్ర‌ల్'... మహాభారతంలో అమీర్ ఎలా నటిస్తాడని అంటావా?

మహాభారతం చిత్రం భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ భీముడు పాత్ర పోషిస్తున్నారన్నది తెలిసిందే. ఇకపోతే ఇదే చిత్రంలో అమీర్ ఖాన్ కృష్ణుడుగా నటించబోతున్నాడంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వం వహించే మహాభారతంలో అమీర్ ఖాన్

మహాభారతం చిత్రం భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ భీముడు పాత్ర పోషిస్తున్నారన్నది తెలిసిందే. ఇకపోతే ఇదే చిత్రంలో అమీర్ ఖాన్ కృష్ణుడుగా నటించబోతున్నాడంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వం వహించే మహాభారతంలో అమీర్ ఖాన్ కృష్ణుడిగా నటిస్తాడంటూ మరో ప్రచారం జరుగుతూనే వుంది. ఈ నేపధ్యంలో ఫ్రెంచ్ కాల‌మిస్ట్ ఫ్రాంకోయిస్ గుట‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా అమీర్ ఖాన్ పైన ప‌లు కామెంట్లు చేశాడు. 
 
హిందువుల ఇతిహాసం మ‌హాభార‌తంలో ముస్లిం వ్య‌క్తి అయిన అమీర్ ఖాన్ ఎలా న‌టిస్తాడు? అంతేకాదు... మరో అడుగు ముందుకు వేసి ఒక‌వేళ మ‌హ‌మ్మ‌ద్‌ ప్ర‌వ‌క్త జీవిత చ‌రిత్ర‌తో సినిమా తీస్తే అందులో ఓ హిందువు ముఖ్య పాత్ర పోషించ‌డానికి ముస్లింలు అంగీక‌రిస్తారా అంటూ మరీ హీట్ రాజేశాడు. దీనిపై జావేద్ అక్త‌ర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
'యూ స్కౌండ్ర‌ల్...' అంటూ మొద‌లెట్టి మా దేశంలో విష‌పూరిత వాతావ‌ర‌ణం సృష్టించాల‌ని చూస్తున్నావా అంటూ మండిపడ్డారు. నీ వెనుక ఏ ఫారెన్ ఏజెన్సీ ఉందీ, భారతీయ సంప్ర‌దాయం, సంస్కృతి గురించి నీకేం తెలుసు? మ‌తోన్మాదం అనే బావిలో ఉన్న క‌ప్ప‌వి నువ్వు... అని ఆవేశపూరిత కామెంట్లు చేశాడు. అమీర్ ఖాన్ ఇప్పటికే తనకు మహాభారతంలో శ్రీకృష్ణుడు లేదా కర్ణుడు పాత్ర చేయాలని వుందని పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తమ్మీద అమీర్ ఖాన్ ఆ రెండు పాత్రల్లో నటిస్తాడో లేదో కానీ ఇప్పుడే ట్వీట్ల యుద్ధమైతే సాగుతోంది.